|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులతో సమావేశమై డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సమక్షంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో, కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామస్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని, గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని ఆదేశించారు.

అలాగే, రైతు వేదికల వద్ద గంజాయి సాగు వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాలపై జాగృతి కల్పించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, పరిశ్రమల వద్ద, డాబాలు ప్రాంతాల్లోకి వచ్చే కార్మికులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు.








