|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బతండా గ్రామ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజాంసాగర్ D-46 కెనాల్ పై జరుగుతున్న ఆక్రమణలను నిరసిస్తూ వారు మంగళవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల వివరాల ప్రకారం, వారు గత రెండు సంవత్సరాల క్రితం స్వయంగా ఇండ్లు నిర్మించుకొని శాంతియుతంగా నివసిస్తున్నామని, అయితే వారి ఇండ్ల ఎదుట ప్రవహించే D-46 కెనాల్ పై కొంతమంది వ్యక్తులు అక్రమంగా పెంటకుప్పలు, గాడ్డివాములు ఏర్పాటు చేసి కెనాల్ గట్టు పై పలు నిర్మాణాలను చేపట్టారు అని, దీని వల్ల జల ప్రవహక మార్గం పూర్తిగా ధ్వంసం కావడమే కాక, చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది అని,
ఈ కారణంగా వర్షాకాలంలో దోమలు, ఈగలు, విషపూరిత పురుగులు ఇళ్లలోకి ప్రవేశించి, ప్రజలు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు గురవుతున్నారు. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.
ఈ విషయం గత కొన్ని రోజుల క్రితం అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, అక్రమాదారులు అధికారుల చర్యలను అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
D-46 కెనాల్ పై కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని, అలాగే అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








