|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద ఉన్న ప్రసిద్ధ త్రివేణి సంగమం ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉండడంతో భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు త్రివేణి సంగమానికి వస్తుండటంతో, ప్రమాదకర ప్రాంతాలలో గజ ఈతగాళ్లు, ప్రమాద నివారణ బోర్డులు, త్రాడులతో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరికలు స్పష్టంగా ఉండాలని, నదిలోకి లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు.
ఈ భద్రతా తనిఖీ కార్యక్రమంలో బోధన్ ACP శ్రీనివాస్, రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ బాబు, రెంజల్ SI చంద్ర మోహన్ పాల్గొన్నారు.








