|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వాణిజ్య దుకాణాలపై పెండింగ్ ఆస్తి పన్ను వసూలు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్, ఈఈ మురళి రెడ్డి, వార్డ్ ఆఫీసర్ మరియు ఇతర సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అధికారులు దుకాణదారులను కలిసి పెండింగ్ ఆస్తి పన్ను వెంటనే చెల్లించాలని సూచించారు. పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే దుకాణాలను సీజ్ చేయనున్నట్లు హెచ్చరించారు.

ఈ చర్యలు నగరంలోని పన్ను వసూలును పెంచడం, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా చేపట్టారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న దుకాణదారులు వెంటనే చెల్లించాలని చెల్లిచని యెడల కఠిన చర్యలు తప్పవని అధికారులు సూచిస్తున్నారు.








