|| దృశ్యం న్యూస్ ||
2025-2027 సంవత్సరాలు కొరకు ఎంపీడీవో ల సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు డి.ఆర్.డి.ఓ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ ఎన్నికల నిర్వహణ కోసం CEO ZP మరియు ఎన్నికల అధికారి డి. సాయ గౌడ్ ఆధ్వర్యంలో జరిగాయి.
-అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్
-ప్రధాన కార్యదర్శి బి. శ్రీనివాస రావు
-కోశాధికారి రాం నారాయణ
-ఉపాధ్యక్షులు-1 శ్రీమతి నీలవతి
-ఉపాధ్యక్షులు-2 బి. రాములు నాయక్
-జాయింట్ సెక్రటరీ జి. వెంకటేశ్వర్
-ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగ్ నాథ్
-పబ్లిసిటీ సెక్రటరీ సతీష్ కుమార్
-ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఏ. బాలకిషన్, శ్రీను, శంకర్, తిరుమల, రాజా శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.
ఈ నియామకాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారి డి. సాయ గౌడ్ తెలిపారు.
ఈ నూతన కార్యవర్గం ఎంపీడీవో ల సంఘం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.








