నిజామాబాద్: ప్రభుత్వ, ప్రయివేట్ అన్ని పాఠశాలలకు ఈరోజు సెలవు.

|| దృశ్యం న్యూస్ ||

భారీ వర్షాల ప్రభావంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాల మేరకు జిల్లా విద్యా అధికారి అశోక్ నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈరోజు (గురువారం) సెలవు ఇవ్వబడింది.

గత రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు నిల్వ ఉండటం, రవాణా అంతరాయం కలగడం వల్ల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

విద్యార్థుల ప్రాణ భద్రత ముఖ్యమని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అవసరం లేని సందర్భాల్లో బయటకు పంపవద్దని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment