నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్||

తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతుంది అని తెలిపారు.

విద్యార్థులు ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్ మెన్ సివిల్, స్టెనోగ్రఫీ (ఇంగ్లీష్), డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐ.ఓ.టి. హెల్త్కేర్, సోలార్ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్ వంటి కోర్సులకు మరియు కొత్తగా టాటా సంస్థ సౌజన్యంతో ప్రారంభించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లోని కోర్సులకు కూడా ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు.
దరఖాస్తుతో పాటుగా SSC మార్కుల జాబితా, కుల దృవీకరణ, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ జతపరచాలని కోరారు.
ఆసక్తి గల విద్యార్థులు త్వరగా తమ దరఖాస్తులను పూర్తి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచిచారు.

Join WhatsApp

Join Now

Leave a Comment