|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నియమితమైన పోలీస్ సిబ్బంది యొక్క రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ హాజరయ్యారు.
జిల్లా ఎస్ పి డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలలో పోలీస్ శాఖలో అనేక మార్పులు జరిగాయని ప్రతి పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, అనుకూలంగా పనిచేయాలని సూచించారు.

“పగలు మరియు రాత్రి సమయంలో జరుగుతున్న దొంగతనాల్లో పోయిన డబ్బు కంటే ఆన్లైన్ మోసాల వలన పోగొట్టుకున్న డబ్బు ఎక్కువగా ఉంది అని, నేరస్థులపై నిఘా పెట్టి ఉండాలని, సాక్షాలను సేకరించి క్రమశిక్షణతో నేరాలను నిరోధించాలని సూచించారు.
ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ మరియు డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ పై నూతన సిబ్బందికి కీలక సూచనలు ఇస్తూ, సీసీ కెమెరా ఉపయోగం, వాటి పాత్రను క్రైమ్ డిటెక్షన్ లో వివరించారు.
“మీరు ఉన్నత విద్యను అభ్యసించిన వారు కావడంతో, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి, నేరరహిత జిల్లా కోసం ప్రయత్నించండి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, CCTNS అనిల్ మరియు సిద్దు అమర్నాథ్ సిబ్బంది పాల్గొన్నారు.








