|| దృశ్యం న్యూస్ ||
మారుతి సుజుకి వారి న్యూ డజ్లింగ్ డ్రైజ్ కారును వర్ని వరుణ్ మోటార్స్ బ్రాంచ్ లో లాంచ్ చేసింది,
ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా వర్ని ఏఎంసి ఛైర్మెన్ కులకర్ణి సురేష్ బాబు మరియు మాజీ సర్పంచ్ బుజ్జి పాల్గొన్నారు.

ఈ కొత్త మోడల్ కారును ఆవిష్కరించిన అనంతరం దాని ఫీచర్లపై మాట్లాడుతూ, న్యూ డజ్లింగ్ డ్రైజ్ 4వ జనరేషన్ Z-సిరీస్ ఇంజన్ తో వినియోగదారులకు ఉత్తమ ప్రయాణ అనుభవం ఇవ్వడమే కాకుండా 27 లక్షలకు పైగా వినియోగదారుల సంతోషకరమైన ప్రేమను పొందింది అని, ఈ కారులో కొత్త ఫీచర్లు మరియు ఆధునిక టెక్నాలజీ కలిగి ఉండి వినియోగదారులు ఈ కారు నడపడంలో ప్రత్యేక ఉత్సాహాన్ని పొందవుతారని వారు పేర్కొన్నారు.
ఈ కొత్త కారును వర్ని బ్రాంచ్ లో మొదట పూల్ సింగ్ కు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వర్ని బ్రాంచ్ మేనేజర్ సంతోష్, రాహుల్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










