కుక్కలు తినే పళ్లెంల్లో వడ్డన: బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ అతిథి బార్ అండ్ రెస్టారెంట్‌లో శుక్రవారం జరిగిన ఒక ఘటన స్థానిక కస్టమర్లకు విస్మయానికి గురిచేసింది.
ఆహారం తినడానికి వచ్చిన కస్టమర్లు వదిలిన పళ్లెంలను సిబ్బంది శుభ్రపరచక పోవడంతో ఆ పళ్లెంలో మిగిలిపోయిన ఆహారం ఓ కుక్క తినడం గమనించారు, ఈ దృశ్యాన్ని చూసిన ఇతర కస్టమర్లు ఫొటోలు తీసి పత్రిక ప్రతినిధులకు పంపించారు.

ఈ ఘటనను చూసిన భోజనం తినేందుకు వచ్చిన కస్టమర్లు ఇలాంటి చోటుకి ఆహారం తినడానికి వచ్చామా అని, మనకు ఇలాంటి పరిస్థితేంటి అని, ఈ విషయం పట్ల తీవ్ర అనిశ్చితిని వ్యక్తం చేస్తు, ఇలాంటి పళ్లెంలలోనే ఇతరులకు వడ్డిస్తుంటారు అని, ఈ ప్రదేశంలో ఇలాంటి సంఘటనలు పలు సార్లు చోటుచేసుకున్నాయని, నిర్లక్ష్యం అనేది రెస్టారెంట్ నిర్వాహకులకు సామాన్య సమస్యగా మారింది అని వారు ఆందోళన వ్యక్తం చేస్తు, అధికారుల, ప్రజా ప్రతినిధుల అండతో నిర్వహకుల వైఫల్యం ఎంతగా ఉన్న ఇలాంటి విషయాలు ఎన్నో బయటకి రావడం లేదని, కేవలం ఓ రెస్టారెంట్ నిర్వహకుల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాత్రమే కాదు, స్థానిక అధికారుల అండ వల్ల ఈ సమస్యలు మరింత పెరిగాయని అది మరింత నిర్లక్ష్యానికి కారణం అవుతున్నాయి అని, నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ఎలాగైనా ప్రజలకు సంబంధిత అధికారులకు తెలియచెయ్యలనే ఉదేశ్యంతో ఫోటోలు తీసిన కస్టమర్లు పత్రిక ప్రతినిధులకు ఫోటోలు పంపించారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు విధించాలి తెలియచేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment