|| దృశ్యం న్యూస్ ||
గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కండిడేట్ నీలం మధు సోమవారం పరామర్శించారు.
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మదన్ రెడ్డిని కలసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న నీలం మధు మధన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రెండు సార్లు నర్సాపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన మదన్ రెడ్డి, తన ప్రజల కోసం అంకితభావంతో సేవలందించిన నేత అని, ప్రజల ఆశీస్సులతో మరియు భగవంతుడి కృపతో త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా తిరిగి ప్రజలకు సేవలందిస్తారని నీలం మధు అన్నారు.








