నవీపేట రైల్వే గేట్ 5 రోజులపాటు మూసివేత: రోడ్డు ప్రయాణ మార్గాలలో మార్పులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, నవీపేట రైల్వే గేట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మూసివేయబడనుంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలియచేసారు. రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే మరమ్మత్తుల కారణంగా నవీపేట ప్రధాన రైల్వే గేటు మూసివేస్తున్నట్లు చెప్పారు.

ఈ సమయంలో నిజామాబాద్ నుండి బైంసా వైపు ప్రయాణించే వాహనాలు సాటాపూర్, తాడ్ బిలోలి, ఫకీరాబాద్ మీదుగా వెళ్లాలని, మరియు నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు కమలపూర్, మొకన్ పల్లి, గుండారం మార్గాలను అనుసరించాలని రైల్వే అధికారులు సూచించారు.

ఈ మార్గమార్పుల వల్ల ప్రయాణికులు ముందస్తుగా మార్గం మార్చుకొని తమ ప్రయాణాన్ని సురక్షిత ప్రణాళికతో చేసుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment