జాతీయ లోక్ అదాలత్ – కేసుల పరిష్కారానికి అద్భుతమైన అవకాశం. : ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

జాతీయ లోక్ అదాలత్ వివాదాలను త్వరగా పరిష్కరించుకునే ఉత్తమ మార్గం అని, వివాదాలు సంవత్సరాల తరబడి కొనసాగకుండా రాజీ ద్వారా శాంతియుతంగా ముగించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం అని జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మార్చి 8న ఉచిత న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అదాలత్‌లో యాక్సిడెంట్, చీటింగ్, కొట్టుకున్న కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, దొంగతనం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి వివిధ కేసులు ఉన్నవారు రాజీపడవచ్చు.

లోక్ అదాలత్ వల్ల లాభాలు :
✔ కేసుల తక్షణ పరిష్కారం
✔ కోర్టు ఖర్చుల తగ్గింపు
✔ న్యాయ ప్రక్రియలో సమయం ఆదా

కక్షిదారులు తమ ఆధార్‌ కార్డ్ తో హాజరై రాజీ చేసుకోవచ్చని మీ కేసును త్వరగా ముగించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని జిల్లా ఎస్పీ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment