నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు.

|| దృశ్యం న్యూస్ ||

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బోధన్ మండలం పెంట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించటం జరిగింది.
ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ మాట్లాడుతూ, 1982లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడాన్ని చరిత్రగా పేర్కొన్నారు.

ఎన్టీఆర్ 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచిన నాయకుడిగా గుర్తించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నుంచి స్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని రాజేందర్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment