|| దృశ్యం న్యూస్ ||
జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి 48 సీట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఎంపీ అర్వింద్ తీవ్రంగా స్పందించారు, మంగళవారం నిజామాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశలు పెట్టుకున్నప్పటికీ, కేవలం 8 సీట్లకే పరిమితమైందని ఆయన గుర్తుచేశారు.
ఈ పరిస్థితులలో ప్రజలు ఇప్పటికి బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారాని ఇకనైనా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీకి కావాల్సిన మార్గదర్శకత మరియు వ్యూహం చెయ్యాలి అని వ్యాఖ్యానించారు, రాష్ట్రంలో బీజేపీకి తిరిగి ప్రజా ఆదరాభిమానం, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం కోసం పార్టీ అధిష్టానం సరైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు.








