ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం – PYL, POW పిలుపు.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీ పెరిగినట్టు ప్రగతిశీల యూత్ లీగ్ (పి.వై.ఎల్) మరియు ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) నేతలు మండిపడ్డారు.
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లలో ఫీజుల పెరుగుదలపై ప్రభుత్వానికి నిలదీస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పి.వై.ఎల్ జిల్లా అధ్యక్షుడు అనీష్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, పి.ఓ.డబ్ల్యు అధ్యక్షులు వి. గోదావరి, కే. సంధ్యారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందకపోవడం వలన ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకోవడమే అనాదిగా మారిందని, ఈ సందర్బం ఉపయోగించికొని ప్రైవేట్ హాస్పిటల్స్ భారీ ఫీజులు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు.
టెస్టుల పేరుతో, మందుల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేయడం, అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో అవకతవకలు జరగడం వంటి సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు.

ఇలాంటి ఫీజుల దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంచాలని, డయాగ్నొస్టిక్ సెంటర్లపై ప్రభుత్వం నియంత్రణ పెంచాలని కోరుతూ, ప్రభుత్వానికి ఈ పరిస్థితిపై విచారణ జరిపి, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పి.వై.ఎల్ మరియు పి.ఓ.డబ్ల్యు సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై ఆందోళనలు, సర్వేలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, నవంబర్ 30 లోపు హాస్పిటల్స్ లో సర్వేలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పి.ఓ.డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సత్యక్క, సహాయ కార్యదర్శి రమా, పి.వై.ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, జిల్లా నాయకులు దండు మహేష్, రాజేశ్వర్, మహిళా నాయకులు నర్సక్క, పద్మ, పుష్పలత, అమూల్య, లలిత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment