మెదక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం – కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్‌లో, ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఉపాధ్యాయుల ఎంఎల్సీ అభ్యర్థి కొమరయ్య, బిజెపి తెలంగాణ ఉపాధ్యక్షులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, మెదక్ బిజెపి అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా ఇంచార్జ్ మురళి గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, జిల్లా నాయకులు, మోర్చా నాయకులు, మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణలో సీఎంలు మారినా, రాష్ట్ర పాలనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు అని, రాబోయే శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడాలని” అన్నారు. ఎన్నికల తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమబాటలో నిలబడతామని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment