|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం పొందడం గర్వకారణమని చెప్పారు.
మెదక్ జిల్లా నుండి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అభ్యర్థిగా గెలుపు కోసం పట్టభద్రులు అన్ని వర్గాలనూ ఒకచోట చేర్చి ఆయన విజయం కోసం కృషి చేయాలని “ఎమెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి ఓటు వేయడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అని” తెలిపారు.
ఈ సందర్భంగా, ఎంపీ డా. మైనంపల్లి రోహిత్ పట్టభద్రుల కోసం 25 మందికి ఒక ఇన్ఛార్జ్ను నియమిస్తామని చెప్పారు. “మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ విశేషమైన ప్రగతి సాధిస్తుందని” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు సుప్రభాత రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








