సింగపూర్‌లో శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

సింగపూర్ నగరంలోని ప్రముఖ శ్రీ భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ఆయన భార్య పుష్పమ్మ దంపతులు సందర్శించారు. వారు కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మరియు ఆయన భార్య సోనీ రెడ్డి కూడా ఆలయాన్ని సందర్శించారు.
శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం ద్వారా వారు మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

ఈ సందర్శనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలతో కూడిన కార్యక్రమం నిర్వహించబడింది అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment