|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, గంగమ్మ తల్లి ఆశీస్సులతో చిత్రియాల్ గ్రామ ప్రజలు సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చేర్మెన్ బాలగౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








