మెదక్: వరద బాధితులకు సహాయం అందించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహాయకహస్తం అందించారు.

మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధూప్ సింగ్ తండాలోని వరద ప్రభావితులకు 25 కిలోల రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ప్రతి రేషన్ కిట్‌లో బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, బ్రెడ్, తాజా కూరగాయలు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సహాయం కొంతవరకు ఊరటనిచ్చింది. కష్టసమయంలో ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే రోహిత్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment