|| దృశ్యం న్యూస్ ||

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ బుధవారం రాందాస్ చౌరస్తా, మెదక్ పట్టణంలో చేపట్టారు.
ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవం.

మెదక్ పట్టణంలోని స్టేడియం వద్ద నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు పంచాయతీ రాజ్ ఎస్.ఈ జగదీశ్వర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్, వర్కింగ్ జర్నలిస్ట్ ఎస్. నరసింహచారి, గౌరవ అధ్యక్షుడు కామటి కిషన్, కోశాధికారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, గౌరవ సలహాదారులు, ఉపాధ్యక్షులు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ను జర్నలిస్ట్ సంఘ సభ్యులు శాలువాతో సన్మానించి మెమోంటోను అందజేశారు.








