లా & ఆర్డర్ కాపాడలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : MLA ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ లో & ఆర్డర్ పరిస్థితి విషమంగా మారిందాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేసారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా ఘటనలు శాంతి భద్రతలపై తీవ్రమైన ఆలోచనలు పెంచుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లా & ఆర్డర్ కాపాడలేకపోతే, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు, ఇటీవల సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ద్వంసం చేయడం అత్యంత కఠినమైన ఘటనగా నిలిచిందాని, ఈ ఘటనకు సంబంధించి హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందని, ముత్యాలమ్మ విగ్రహం, హిందువుల ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉండటం వల్ల విగ్రహాలపై జరిగిన దాడులు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని హిందువుల పట్ల జరుగుతున్న అప్రతిష్టాపనను అడ్డుకోవాలి మతం, రాజకీయాల పేరిట ఈ ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పారు.

అదేవిధంగా రాష్ట్రంలో అసమర్ధవంతమైన ప్రభుత్వం కొనసాగుతుందని ఇటువంటి సంఘటనలను నివారించలేక పోతే, ముఖ్యమంత్రి బాధ్యతలను వదులుకోవాలని డిమాండ్ చేస్తు ప్రజలు శాంతియుతంగా జరుపుకునే ర్యాలీకి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి, పరిస్థితిని మరింత విషమం చేసారని, ఈ చర్యలు ఖండిస్తూ “ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల గౌరవాన్ని కాపాడాలని” అని గుర్తుచేశారు.

80% హిందువుల ఓపికను పరీక్షిస్తే, తదుపరి పరిణామాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రం ఇప్పటివరకు తలెత్తిన సమస్యల కంటే మరింత తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ ఈ ప్రశ్నలపై స్పందించి, ప్రజల సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇస్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగవుతాయని, ఈ పరిస్థితులు, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జఠిలం కాకుండా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రస్తుత సమయం అనివార్యమైందాని, ముఖ్యంగా ప్రభుత్వ నిష్పత్తులు నేడు ప్రజల ఆదరణను పొందడం కోసం కృషి చేయాలి అని ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment