ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆందోళన : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోటగల్లీ ప్రభుత్వ బాలికల హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న విద్యాభ్యాసం పట్ల ధన్ పల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, తరగతి గదులలో ఖచ్చితమైన విద్యాను అందించే పరిస్థితి లేదని, పాఠశాల గదులలో విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు చీకటిలో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, తరగతి గోడల పరిస్థితి దయనీయమని అవి ఏ సమయంలో కూలిపోతాయనే భయంతో విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు, దాదాపు 700 మంది విద్యార్థులకు కేవలం 6 టాయిలెట్లు ఉండడం,
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థిని చనిపోయిన ఘటనను కూడా ఆయన గుర్తుచేశారు, వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం మేనూ ప్రకారం ఇవ్వడం లేదని,

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు, ఈ కార్యక్రమంలో MEO సాయ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment