నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు చెయ్యండి : ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పట్టణంలో 27వ డివిజన్ ఆనంద్ నగర్, 9వ డివిజన్ ఓల్డ్ నాగారం, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ నగర మేయర్ నీతు-కిరణ్ పాల్గొని భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పల్ మాట్లాడుతూ, జనరల్ ఫండ్ ద్వారా ప్రతి డివిజన్‌కు పదిలక్షల రూపాయలు మంజూరు చేశామని, ఈ ఫండ్ లో భాగంగా నగరంలో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు.

నిజామాబాదు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తగిన నిధులు మంజూరు చేయాలని ఇంచార్జ్ మంత్రి జూపల్లి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకపోవడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నగర అభివృద్ధికి 100 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తను గెలిచి పదినెలలు గడుస్తున్న ఎమ్మెల్యేగా తనకు రావలసిన సొంత నిధులు కూడా రాలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, సాయి వర్ధన్, బుర్గుల ఇందిర మరియు వినోద్, బిజెపి నాయకులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment