గోల్డ్ మెడల్ సాధించిన సాయి ప్రసన్నను అభినందించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ ||

SGF జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న ఎంపిక కావడంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఘనంగా అభినందించారు.

అక్టోబర్ 26, 27 తేదీలలో వికారాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో సాయి ప్రసన్న బాలికల విభాగం అండర్ 29 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు తన ప్రతిభను ప్రశంశిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్, బోర్గం జడ్పిహెచ్ఎస్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న సాయి ప్రసన్న రాష్ట్రస్థాయిలో ఈ విజయం సాధించినందుకు ప్రజలతోపాటు తన కోచ్ మనోజ్ కుమార్ ను కూడా అభినందించారు.

ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ, సాయి ప్రసన్న SGF జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించాలని, మన జిల్లా క్రీడాకారిణి తన ప్రతిభతో మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు, ఇదేవిధంగా ప్రతి విద్యార్థి క్రీడలలో పాల్గొని వారి భవిష్యత్తును మెరుగుపర్చాలని అన్నారు.

ఈ ఘనత సాధించడం నిజంగా గర్వకారమని, ఆమె విజయాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ధన్ పాల్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment