|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఎన్నుకున్న నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కదం ప్రకాష్ కు, కార్యవర్గ సభ్యులకు పూలమాలలు వేసి, శాలువలు కప్పి అభినందనలు తెలిపారు.

ఎంఐఎం నాయకుడు రహీం అలీ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ, మీడియా, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పరస్పరం కలిసి మండల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఎం మండల ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ అబ్దుల్, కార్యదర్శి ఆసీఫ్, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, విలేకరులు పాల్గొన్నారు.








