|| దృశ్యం న్యూస్ ||
గత శనివారం రోజున దృశ్యం న్యూస్ లో వచ్చిన అంగన్వాడి కేంద్రాల పనితీరు అస్తవ్యస్తం || బినామిలతో కేంద్రాల నిర్వహణ. అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను అధికారులు సందర్శించి విచారణ చేసి టీచర్లకు ఆయాకు సిడిపిఓ జానకి మెమోలు జారీ చేసారు.

అంగన్వాడీ కేంద్రాలలో ఎలాంటి తప్పిదాలు చోటు చెసుకోవద్దని టీచర్లు, ఆయాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ సందర్బంగా బోధన్ ప్రాజెక్టు సిడిపిఓ జానకి, మండల పర్యవేక్షకురాలు విజయ రాణి, గ్రామ ప్రత్యేక అధికారి గబ్బర్ సింగ్, పాల్గొన్నారు.
అదేవిధంగా అంగన్వాడీ రెండవ సెంటర్లో ఉన్న పిల్లలకు సిడిపివో యూనిఫామ్స్ అందచేయడం జరిగింది.








