తాహాసిల్దార్ శాంతను ఘనంగా సన్మానించిన వాడి గ్రామ వీడిసి సభ్యులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం తాహాసిల్దార్ టి. శాంతను వాడి గ్రామానికి చెందిన వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు బుధవారం తాహాసిల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధిలో ఆమె అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సన్మాన కార్యక్రమంలో వాడి వీడిసి చైర్మన్ జిన్న సాయిలు అలియాస్ కపిల్, సభ్యులు లింగపురం సాయిలు, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు ఎల్లారం భాస్కర్, రోడ్ల గంగారెడ్డి, బీజేపీ నాయకుడు తాళ్ల రామచందర్ వంటి వివిధ పార్టీల నాయకులు కూడా పాల్గొనడం విశేషం.

తాహాసిల్దార్ కార్యాలయాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా మార్చే దిశగా ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment