మార్కెట్ ఛైర్మెన్ సురేష్ కులకర్ణిని సన్మానించిన బ్రాహ్మణ సంఘం సభ్యులు.

|| దృశ్యం న్యూస్ ||

వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ కులకర్ణిని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మరియు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా కిరణ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ, బ్రాహ్మణ జాతి నుంచి సురేష్ కులకర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కావడం బ్రాహ్మణుల గర్వానికి కారణమని కొనియాడారు.

సంఘం సభ్యులు సురేష్ కులకర్ణికి విజ్ఞప్తి చేస్తూ, బ్రాహ్మణ భవనాన్ని స్థాపించడానికి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా స్థలం ఆమోదించడంపై విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సురేష్ కులకర్ణి తాము తప్పకుండా ప్రయత్నం చేస్తానని, బ్రాహ్మణ భవనం కోసం తన వంతు బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రమేష్ కులకర్ణి, లక్ష్మి నారాయణ, భరద్వాజ్, నాగేష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment