వర్ని మండలంలో కాంగ్రెస్ నాయకుల పత్రికా సమావేశం.

|| దృశ్యం న్యూస్ ||

బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. రేపు హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యవేక్షకురాలు మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

సమావేశంలో ఉమ్మడి వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, PCC డెలిగేట్ డా. కూనీపూర్ రాజారెడ్డి, మాజీ AMC వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, నాయకులు కలాల్ గిరి, అబ్దుల్ బారి, కృష్ణారెడ్డి, ప్రవీణ్ గౌడ్, అహ్మద్, సాయిలు, ఇతర నాయకులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment