మెదక్ : రోజువారి మెనూని ఖచ్చితంగా అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులు పరిశుభ్రతతో చదువుకోవాలని, పాఠశాలలో పరిశుభ్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

వంటగదిని పరిశీలించిన కలెక్టర్, వంటసరకులు సరిగ్గా నిల్వ ఉంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. బియ్యం, పప్పులు, వంట నూనె, కూరగాయలు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, తరగతి గదులను పరిశీలించి పరిశుభ్రత కొనసాగించాలని స్పష్టం చేశారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారి విద్యా స్థాయిని తెలుసుకొని, రోజువారి మెనూ సమయానికి అందుతున్నదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని, మంచి విలువలతో ఎదగాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment