|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతుంది. 17న జిల్లా ఆస్పత్రిలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ 5 ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించి, మొత్తం 65 శిబిరాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో అధిక రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్, గైనకాలజీ, ENT, దంతవైద్యం, మానసిక ఆరోగ్యం సేవలు అందించబడతాయి. తల్లి-శిశు సంరక్షణ, రోగనిరోధక టీకాలు, పోషకాహార అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి.

అక్టోబర్ 1న మెగా రక్తదాన కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్ష యూనిట్ల రక్తం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పోషన్ మాహ్‌తో కన్వర్జెన్స్ ద్వారా అంగన్‌వాడీలలో పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు భాగస్వామ్యంతో మహిళలు, పిల్లలకు ఉచిత వైద్యసేవలు అందించబడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ జడ్పీ సీఈఓ ఎల్లయ్య డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.








