|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 13 ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలకు సమస్యల పరిష్కారానికి తక్షణ సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధ పరిష్కారం ద్వారా ప్రజలకు న్యాయం చేయడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో త్వరితగతిన పరిష్కరించడం కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.








