మెదక్ ఎస్.పి శ్రీనివాస రావు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలన.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు వినాయక నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌లను స్వయంగా సందర్శించారు. ముఖ్యంగా కోమాటూరు నిమజ్జనం పాయింట్ వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఎస్.పితో పాటు ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్‌.ఐ. మురళి భద్రతా చర్యలు, పోలీసు సిబ్బంది విభజన, ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహ నియంత్రణ, రక్షణ సిబ్బంది ఏర్పాటు వంటి అంశాలను వివరించారు.

ఏ.పి శ్రీనివాస రావు మాట్లాడుతూ, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు నిమజ్జనం కోసం వచ్చే సందర్భంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

అదనంగా, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అంబులెన్స్ రక్షణ బృందాలు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరగడానికి పోలీసులకు సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment