|| దృశ్యం న్యూస్ ||
మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి బదిలీ అయినా నేపథ్యంలో ఆస్థానంలో నూతన రూరల్ సిఐగా యం. జర్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
విధి నిర్వహణలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం.

నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కీర్తిశేషులు పండరి భార్య చంద్రకళకు Widow Corpus Fund క్రింద రూ.1,00,000/- చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు. పండరి కుటుంబ పరిస్థితులు, పిల్లల విద్య వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. మరణించిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని, మిగిలిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








