|| దృశ్యం న్యూస్ ||
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులు ఆలోచించి ఓటు వేయాలని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు.
సోమవారం మెదక్ కోర్ట్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి గెలవాలని డా. రోహిత్ పిలుపునిచ్చారు. “మీరు ఇచ్చే సహకారంతోనే నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఈ గెలుపుతోనే మెదక్ జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలతో పాటు 7 పాయల దేవస్థానం అభివృద్ధి కూడా సాధించాం,” అని చెప్పారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో సమన్వయం పెంచి, ఇండ్ల స్థలాలు, న్యాయవాదుల సముదాయ భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తూ, మీ ఆలోచనతో ఓటు వేయడం ద్వారా మెదక్ జిల్లాకు మరింత అభివృద్ధి చెందుతుందని అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, సెక్రెటరీ శ్రీపతి రావు, సీనియర్ న్యాయవాదులు పోచయ్య, న్నారు తదితరులు పాల్గొన్నారు.
27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డికి ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని డా. రోహిత్ కోరారు.








