|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా చిట్కుల్‌లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ, “తిరుగుబాటు తత్వానికి ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ” అని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనలో అణగారిన బహుజన వర్గాలకు ధైర్యం, సమానత్వం నేర్పిన ఆ మహనీయురాలి త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.

చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నీలం మధు, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తోంది. మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం గర్వకారణం” అని అన్నారు. భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, మాజీ PACS చైర్మన్ నారాయణ రెడ్డి, మహేష్, సత్తయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.








