మహిళా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం – మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అట్టహాసంగా నిర్వహించారు. పాపన్నపేట, మెదక్, పాతూరు, రామాయంపేట ప్రాంతాల్లో ఎమ్యెల్యే మహిళలకు చీరలను అందజేశారు. మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వానికి ప్రాధానం అని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


మహిళా సంఘాలు ఎంపిక చేసిన మోడల్ చీరలను పంపిణీ చేస్తూ, ప్రతి మహిళకు అందేలా అధికారులను, గ్రామ–మండల సమాఖ్యలను ఆదేశించారు. మహిళలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి వడ్డీ రహిత రుణాలపై వడ్డీని ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు.
రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సుల కొనుగోలు వంటి రంగాల్లో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం సహాయం అందిస్తోందని చెప్పారు. రైతుల వరికి బోనస్‌తో కూడిన కొనుగోళ్లు, సన్నబియ్యం ఉచిత పంపిణీ వంటి పథకాలతో ప్రజా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment