|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్ప భార్య నాగప్పగారి బుజ్జమ్మకు భద్రత ద్వారా విడుదలైన 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును, 10 వేలు విడో ఫండ్, 50 వేల రూపాయల కార్పస్ ఫండ్‌ను అందజేసారు. హెడ్ కానిస్టేబుల్ వీరప్ప HC-1160 అనారోగ్యంతో 27-11-2024 న మరణించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి వీరప్ప కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ద్వారా అందించే సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వవంతంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను త్వరలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి ఎస్. మహేందర్, ఏఓ జి. మణి, సూపరిడెంట్ అనురాధ, జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.








