|| దృశ్యం న్యూస్ ||
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గణపతి పదవీ విరమణ సందర్భంగా సాయిబాలాజీ గార్డెన్‌లో గడ్డం శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, విద్యావేత్తలు గణపతి సేవలను ప్రశంసించారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేసి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో గణపతి పాత్ర కీలకమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
భవిష్యత్‌లో గణపతి సేవలు దేశ అభివృద్ధికి కొనసాగాలని, ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కార్యకలాపాలలో కొనసాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఎల్.ఎన్. రెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








