|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో DCRB కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న చేనేశ్వరి ఇటీవల మెదక్ కిమ్స్ హాస్పిటల్ లో 04-10-2024 నాడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి అకాల మరణం చెందారు. ఆమె భర్తకు ₹3,78,160/- విలువ గల పోలీసు భద్రత ఎక్స్-గ్రేషియా చెక్కు మరియు వారి ఇద్దరు పిల్లలకు ₹4,00,000/- విలువ గల భద్రత ఎక్స్-గ్రేషియా చెక్కులను జిల్లా ఎస్.పి. డి. ఉదయ్ కుమార్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్.పి. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రభుత్వ బెనిఫిట్లు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురాధ, జూనియర్ అసిస్టెంట్ రమేశ్ పాల్గొన్నారు.








