మెదక్ జిల్లా రగ్బీ ఎంపికల పోటీలు: 36 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రగ్బీ పోటీల్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 వయోపరిమితుల్లో బాలబాలికలు పాల్గొన్నరు. ఈ పోటీల్లో మొత్తం 350 మంది క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు మెదక్ జిల్లా నుండి పాల్గొన్నారు. పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 36 మంది బాలబాలికలు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ కరణం గణేష్ రవికుమార్, మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రమేష్, జిల్లా పీ.ఈ.టీ ల సంఘం అధ్యక్షుడు నాగరాజు, సెలక్షన్ కమిటీ ఇంచార్జ్ శారద తెలిపారు.

ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మేడ్చల్ జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి అండర్ 17 బాల, బాలికల రగ్బీ ఎంపిక పోటీలు, క్రీడాకారులకు మరింత గొప్ప అవకాశాలను అందించనున్నాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, క్రీడాకారులకు సమర్థంగా శ్రద్ధ వహించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో విజయం సాధించి, పాఠశాలలు, కాలేజీల పేరు పెంచాలని సూచించారు. రగ్బీ క్రీడలు ఆడుతున్నవారికి ప్రభుత్వ ఉద్యోగం, ఉన్నత విద్యా అవకాశాలు కూడా కల్పించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లీశ్వరి, రగ్బీ రెఫరీలు నవీన్, మహేష్, శ్రీనాథ్, పీ.ఈ.టీ లు నరేష్, ప్రవీణ్, శేఖర్, శంకర్, నర్సింలు, సరితా, మంజుల, ప్రభు, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment