|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, ఈరోజు మొత్తం 75 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో భూ భారతి సంబంధిత 34, పెన్షన్ 14, ఇందిరమ్మ ఇండ్లు 5, మరియు ఇతర సమస్యలు 26గా ఉన్నట్లు వివరించారు.
దరఖాస్తులను సమయానుసారం పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు పంపించి, ఫీల్డ్ స్థాయిలో పరిశీలన చేసి ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి పరిష్కారం వరకు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ భుజంగరావు తదితర అధికారులు పాల్గొన్నారు.








