ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ ||

ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చాలా ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు తెలిపారు.
ఎన్నికల సంబంధిత అధికారులు, పోల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి, ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కల్పించారు.

 

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జారీ చేయబడిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించబడతాయని పేర్కొన్నారు.

అదేవిధంగా, పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఓటింగ్ గోప్యతను ఖచ్చితంగా అమలులో పెట్టాలని తెలిపారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, తహసీల్దార్లకు పోస్టల్ బ్యాలెట్ విధానంపై అవగాహన కల్పించారు. ఎన్నికల రోజు ముందుగా 26వ తేదీన సకాలంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలకు చేరుకొని, ప్రతి సామగ్రిని సరిచూసుకుని, పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment