సైకిల్ పై తనిఖీ నిర్వహించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ – ఆర్టీసీ డీఎంకు సూచనలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్‌పై ప్రయాణించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్‌లో శుభ్రతను పరిశీలించి, ఆర్టీసీ డీఎంకు పలు సూచనలు ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి, మహాలక్ష్మి పథకంపై మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ప్రభుత్వం బస్టాండ్లను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్-రామాయంపేట బస్టాండ్ సందర్శన కూడా ఈ చర్యల్లో భాగమేనని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment