|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల సన్నాహక సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశం జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాదవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా బీజేపీ పూర్తిగా ఎన్నికలకు సిద్ధమని తెలిపారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ప్రతి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లు సేకరించనున్నామని వెల్లడించారు. జిల్లాలో అభ్యర్థుల ఎంపిక కోర్ కమిటీ ద్వారా జరిగి రాష్ట్రానికి నివేదిక పంపిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను రెండు సంవత్సరాలుగా వాయిదా వేయడం వల్ల గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు ఆగిపోయాయని, కేంద్రం అమలు చేసిన పథకాలతో గ్రామీణ ప్రజలకు అండగా ఉన్నామని, బీజేపీ అభ్యర్థులు వాటిని ప్రచారం చేస్తారని అన్నారు.
ఈ సమావేశంలో గడ్డం శ్రీనివాస్, శ్రీనివాస్ ఈర్ల, రంజిత్ రెడ్డి, రమేష్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.








