|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, బాల్య వివాహాల నిర్మూలనకు పూనుకున్నారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో, దేవాలయాలు మరియు ఇతర పూజా స్థలాల్లో బాల్య వివాహాలు జరగకుండా నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక గోడ పత్రికను రూపొందించారు. ఈ పత్రికను కలెక్టర్ రాహుల్ రాజ్, టిడబ్ల్యుఓ హేమ భార్గవి కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “మెదక్ జిల్లాలో ఇకపై ఒక్క బాల్య వివాహం ఏ ఒక్కటి కూడా జరగకూడదు. ప్రతి అధికారితో పాటు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి,” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజన్ సంస్థ డైరెక్టర్ వంగరీ కైలాస్, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు, సిబ్బంది యాదగిరి, సంజీవ్, నవనీత తదితరులు పాల్గొన్నారు.








