చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిన్నారుల్లో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, తల్లి-బిడ్డ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలి అని, ఇళ్లలో లభించే మునగ, కరివేపాకు వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పోషకాహారం పెరుగుతుందని, తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి అత్యంత అవసరమని వివరించారు.
గర్భిణీ స్త్రీలు తగిన పోషకాహారం తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని DWO సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని, పిల్లల ఎత్తు, బరువు వంటి వివరాలను నియమితంగా ఆన్లైన్‌లో నమోదు చేయాలని, బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలన్నారు.
ఈ సమావేశంలో DWO అధికారి హేమా భార్గవి, సిడిపిఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment