|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆజాద్ జీవితం ప్రతి భారతీయునికి ఆదర్శమని, దేశ విద్యాభివృద్ధికి బాటలు వేసిన మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తుచేశారు.

అదేవిధంగా జర్నలిజంలో అనుభవంతో ఉర్దూ పత్రికను ప్రారంభించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో గణనీయమైన సంస్కరణలు అమలు చేశారని, ఆజాద్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఇన్‌ఛార్జ్ మైనార్టీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








